8 Oct 2014, 7:00PM
‘’జయ’’
ఆశ్వీయుజ పౌర్ణమి
చంద్ర
గ్రహణం వేళ కాలేజి నుండి ఇంటి కి వస్తూ.....
శరదభ్రం
చంద్ర గ్రహణం
మనసు స్తంభించింది
గ్రహణం ముగిసింది
పరవళ్ళు తొక్కింది
ఆలోచనా ఝరి
శరత్కాలపు వినీలాకాశంలో
మేఘాల విన్యాసం
మబ్బు చాటున చంద్రుడు
మబ్బుల ఱేడు దాగినా
అందమే !!!
నిండు పున్నమి
జాబిలి
కురిపిస్తున్న
వెన్నెల వర్షం లో
చకోర పక్షినై ఓలలాడుతున్న
వేళ
మనసు చంద్రుడి
లో లీనమై
ఆ అద్వైత స్థితిలో
ఆ పారవశ్యంలో
ఆలోచన ఆగిపోయింది
మనసు స్తంభించింది.......
No comments:
Post a Comment