అందమైన వెన్నెల లోన
ఆలోచనా భారం తో అలసిన
శనివారపు సంధ్య వేళ ,
నిండు పున్నమి జాబిలి
గిలిగింతల చలి గాలి
నను సేద తీర్చాయి
తల్లి ఒడిలో
చంటి పిల్లాడిలా
ప్రకృతి మాత ఒడిలో
ఒదిగిపోతూ
పరవశిస్తూ
మైమరచిపోతూ .......
నేను.
06 డిసెంబర్ 2014 - కాలేజి నుండి ఇంటి కి వస్తూ నిండు పున్నమి చంద్రుడి ని చూచినా పారవశ్యం లో ...........
No comments:
Post a Comment