ప్రకృతి - పురుషుడు
తెల వారుతోంది
తూరుపున ప్రత్యక్ష నారాయణుడి
పయనం మొదలవబోతోంది
’ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర...’ **
ఆకాశపు కాన్వాసు పై
మబ్బులని అందంగా అమర్చారు ఎవరో?.......
తుఫాను ముందరి ప్రశాంతత లాగా
వేసవి వడగాడ్పు కి ముందు
ఒక శీతల సమీరం
నన్ను ముద్దాడి వెళ్ళింది
ఆ దృశ్యాన్ని ఆస్వాదిస్తూ
లిప్త పాటు కనులు మూసి తెరిచాను.
ఉరకలెత్తించే నూతనోత్సాహం
నా వశమైంది.
ప్రకృతి కి, ప్రత్యక్ష నారాయణుడికి
ధన్యవాదములు.
** చిన్నప్పుడు రేడియో లో విన్న సూర్యాష్టకం
No comments:
Post a Comment