మౌనం శరణం
గచ్ఛామి
ఎన్నో భావాలు మరెన్నో ఆలోచనలు
పరస్పరం పోటీ పడుతున్నాయి
భాష కోసం ప్రాకులాడుతున్నాయి
భావ స్థాయి నుండి భాష స్థాయి కి
ఎదగటానికి తపిస్తున్నాయి
మధ్యమ దశ నుండి వైఖరి దశకి చేరుకోవటానికి ***
మదన పడుతున్నాయి
ఈ భావ సంగ్రామంలో
నిస్సహాయుడనై నేను
మౌనాన్ని ఆశ్రయించాను
చెలీ! నువ్వు రావాలి
ఈ తీగని సవరించాలి
నా మనసు కి మాట నేర్పాలి
*** వాక్కు
కి నాలుగు రూపాలు
- పరా,
పశ్యంతి, మధ్యమ మరియు
వైఖరి. వాయు పిండం
గా మూలాధారం లో
బయలుదేరిన ఆలోచన వెన్నుపూస
ద్వారా పయనిస్తూ పరా,
పశ్యంతి, మధ్యమ స్థితులను
దాటుకుంటూ చివరకి శబ్ద
రూపమైన వైఖరి స్థితి
లో నోటి నుండి
బయట కి వస్తుంది.ఉచ్చరించే
ప్రతీ మాటా ఈ
దశలను పూర్తి చేసుకు
రావాలి. మంత్రాన్ని మధ్యమ
స్థాయి లో నే
ఆపేసి సాధన చేయటాన్ని
మౌన జపం అంటారు.
No comments:
Post a Comment