నీ కోపమ్ నాకు మోదమ్
యెన్నో భావాలు పలికే
ఆ కంటి భాష నాకు తెలుసు,
కాదు నాకు మాత్రమే తెలుసు.
అనునిత్యం అభిమానాన్ని
కురిపించే
ఆ కన్నుల్లో కోపమా?
అభిమానం ఆప్యాయతలతో తలపడి
ఓడిపోయింది - పాపం.
ఆ ప్రేమ సాగరంలో పడి
మునకలేస్తూ
మైమరచిన క్షణం లో ఒక
ఆలోచన
తానోడి నేను గెలిచానా?
లేక
నేనోడి తను గెలిచిందా?
- అని ఒక సన్దేహం
యేమో యేది యేమైనా
ఆ కోపం - నాకు మోదం
No comments:
Post a Comment