13. కడిగిన ముత్యం
దూరంగా......
భూమ్యాకాశాలు ఏకమయ్యే చోట
నల్లని చారలు.
చారలు కావవి
వర్షపు ధారలు.
ఆగిన వర్షం.
పయనం మొదలు పెట్టిన మేఘం
మబ్బు చాటు నుండి సూర్యుడు
బయటికి వచ్చాడు
కడిగిన ముత్యంలా............
(తిరుపతి నుండి నాయుడు పేట లోని మిత్రుడు నాగరాజు ఇంటికి వెళుతూ Bus లో నుండి కనిపించిన దృశ్యానికి స్పందన. ఈ స్పందన కి అక్షర రూపం, నెల్లూరు లో ని మరో మిత్రుడు వేణు ఇంట్లో...)
No comments:
Post a Comment