6 May 2013
ఒక దీర్ఘాలోచనలో
మునిగిపోయిన నేను
చల్ల గాలికి
వయ్యారాలు పోతున్న
ముంగురుల
కితకితల కి
తటాలున ఈ
లోకం లోకి వచ్చాను
నా నుదుటి
పై ఇంతసేపు
నాట్యమాడింది
నీ మెత్తని
మునివేళ్ళేమో యని
చుట్టూ పరికించాను.
నీవు లేవని
తెలిసి
అందమైన భ్రమ
పైకి
ఒక చిరునవ్వు
రువ్వాను.
No comments:
Post a Comment