14. చిన్నీ నా ముక్కు లోని చీమిడా ఎంత పని చేస్తివే
22 Jan 2013
పిల్ల గాలి కరవైందని
చల్ల గాలి కి పోదమని
చెంగున నే బయటికొస్తే
మంచు రూపంలో, పొగ మంచు రూపంలో
నా ’లంగ్సునన్’ దూరి
వెచ్చని నీడ దొరికిందని
మారాము సేయక
కాసేపు విశ్రమించి వెనుదిరిగి పోక,
గళ్ళ అనీ, చీమిడి అనీ,
వివిధ రూపాల్ ధరించి
నా శరీరమున ఉష్ణమున్ పెంచి
అంతాటి విగ్రహాన్ని
అడ్డంగా పడగొడ్తివే! II చిన్నీ II
స్నానము సేయ శరీరము సహకరించక
నల్లని జుత్తునన్ కన్పించు
తెల్లని చుండ్రు పొలసుల గాంచి
ఘనవినీలాకాశంలో
తళుకులీను తారలు గదా
!
అని మురిసిపోతి గదే ? II చిన్నీ II
అలనాడు నీ వోలె అల్పుడల్లె
అగుపించిన ఆ వామనుండు
బలిని ద్రొక్కెనంట పాతాళమునకు
నేను బలిని గాదె ఓ చీమిడీ
నన్ను బలి కోర వద్దే ఓ చీమిడీ
బుద్ధిగా మసలుకొందూనే
ఈ మంచూ, ఆ మంచూ, ఏ మంచూ జోలికి నేనెళ్ళనే
పిల్ల లేదు, చల్ల లేదు, అసలు గాలి ఊసే వద్దు
బుద్ధీ గా నడచుకొందూనే ఓ చీమిడీ II చిన్నీ
II
No comments:
Post a Comment