11. ఓ వర్షం కురిసిన సాయంత్రం.......
నల్లని మబ్బులు
జోరున కురిపించిన వర్షం
నీవు నా పై కురిపించిన
ప్రేమ ముందు చిన్నబోయింది
గిలిగింతలు పెడుతూ
మెల్లగా వీచిన
చల్లటి గాలి
నీ వెచ్చటి ఊపిరిని ఎదిరించి
ఓడిపోయింది
శరీరాన్ని ఆవరించిన బడలిక
మనస్సుని ఆవరించిన నిరుత్సాహం
నీ చిరునవ్వుతో ఛిద్రమయ్యాయి
ప్రకృతి నీకు వశమైంది
ఈ పురుషుడు నీకు దాసోహమయ్యాడు
(ఓ సాయంత్రం చల్ల గాలిలో ఇంటికి వస్తున్న
’పిల్ల’వాడి కి వచ్చిన ఒక అందమైన ఊహ కి అక్షర రూపం)
No comments:
Post a Comment