తెలవారుతోంది
కొబ్బరి ఆకుల
మాటున
అరుణ బింబం
ప్రకృతి కాంత
నుదుటిన
తిలకంతో దోబూచులాడుతున్న
ముంగురులేమో!!!
చైత్ర నిశీధి
లో
ఒంటరి పయనం
గ్రీష్మాన్ని
తలపిస్తున్న
వసంతం
ఈ తాపం
బాహ్యమా?
లేక ఆంతరమా?
తెలియని సందిగ్ధం!!!
అమావాస్య
- ఆకాశంలో పవర్ కట్
’నక్షత్రం’
బ్రాండ్ క్రొవ్వొత్తులను
విరివిగా
వెలిగించిన
పురుషుడెవరో!!!
No comments:
Post a Comment